రాజమండ్రి సిటీ: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత : రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను ప్రజలు భారంగా భావించకూడదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల మంచి కోసమేనని భావించి పనులను విజయవంతం చేయాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, గోదావరి నది జలాలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.