నంద్యాల అర్బన్: సంత జూటూరు పికప్ ఆనకట్ట వద్ద కుందునదిలో పడి ఓ బాలిక మృతి
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
కుందూ నదిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి పదేళ్ల బాలిక మృతి చెందింది. నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాలకు చెందిన షేక్ సుభాన్ బాషా తన కుటుంబంతో కలిసి ఆదివారం బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు ఆనకట్టను చూడటానికి వెళ్లారు. అక్కడ షేక్ షబానా నీటిలో పడటంతో కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.