బనగానపల్లె: యాగంటిలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు
బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు తీవ్రం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు, ప్రాంగణంలో ఈ ఏర్పాట్లు చేపట్టారు. అధికారుల ముందస్తు చర్యల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో వచ్చే యాత్రికులకు దీనివల్ల ఎండ నుంచి ఉపశమనం లభించనుంది.