ఒంగోలు అర్బన్: 9 మందికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 3, 2026
కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన 9 మందికి జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన 9 మందికి ఆయన నియామక పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. విధుల నిర్వహణలో పరిజ్ఞానం పెంచుకొని మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.