మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఎన్నికల వాగ్దానం ప్రకారం రూ.10 వేల వేతనం అమలు చేయాలని సీఐటీయూ నాయకులు ఇబ్రహీంపట్నం మహాసభలో డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని వారు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.