బనగానపల్లె: అవుకు రిజర్వాయర్లు అడుగంటుతున్న జలాలు
నంద్యాల జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లలో ఒకటైన అవుకు రిజర్వాయర్లో జలాలు అడుగంటి పోతున్నాయి. రిజర్వాయర్ అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు రివెట్మెంట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు లీకేజీ రూపంలో వృధాగా పోయింది. మరోవైపు కొలిమిగుండ్ల మండలంలోని సిమెంట్ పరిశ్రమలకు అవుకు రిజర్వాయర్ నుండి నీరు తరలిస్తున్నారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.148 టీంసీలు కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ కూడా లేవని రైతులు వాపోతున్నారు