బనగానపల్లె మండలం రాళ్ల కొత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాళ్ల కొత్తూరు తండాకు చెందిన కిషోర్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న కిషోర్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.