పామూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ భాష మాట్లాడుతూ... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించి వాటి స్థానంలో జనపనార లేదా కాటన్ తో తయారుచేసిన సంచులను ప్రతి ఒక్కరు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను గయాజ్ భాషా వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.