పాలకుర్తి: వల్మిడి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.