బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్, వంద కుటుంబాలు టిడిపిలో చేరిక
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో వైసిపికి షాక్ తగిలింది. కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన సుమారు 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని విడి బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మీర్జాపురం గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విశ్లేషణ విశ్వాసంతో వారు తెలుగుదేశం పార్టీలో చేరడం అభినందనీయమని మంత్రి అన్నారు