డోన్: నేటి తరానికి వాల్మీకి మహర్షి ఆదర్శం : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 20, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో సోమవారం MLA కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి నేటి తరానికి ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆధ్యాత్మికత, సమానత్వం, మానవ విలువలను సమాజానికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడని ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు