సంతనూతలపాడు మండలం వేములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ టి వాణిశ్రీ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వాణిశ్రీ మాట్లాడుతూ ...క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరిని గుర్తించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపేలా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.