ఒంగోలు డి.ఎస్.పి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ్ సరైన పత్రాలు లేని 11 వాహనాలు సీజ్
Ongole Urban, Prakasam | May 9, 2026
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు అధ్వర్యంలో సింగరాయకొండ సిఐ శ్రీహరి, ఒంగోలు సబ్ డివిజన్ 5 మంది ఎస్సైలు , 74 మంది పోలీస్ సిబ్బంది, ఈగల్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి టంగుటూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయవరం గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో మరియు పరిసర ప్రాంతాల్లో శనివారం‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.