అమలాపురం ఓంశాంతి కేంద్రంలో బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్
శుక్రవారం రాత్రి అమలాపురం పట్టణం, రూరల్ గ్రామాల్లో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వీటిలో భాగంగా అమలాపురం ఓం శాంతి కేంద్ర భవనంలో బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలను మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. బండారులంక, ఎన్.రామేశ్వరం, దేవగుప్తం, కొమరిగిరిపట్నం, భీమనపల్లి, విలసవిల్లి, గొల్లవిల్లి తదితర గ్రామాల్లోని శివాలయాలను పెద్ద ఎత్తున భక్తలు దర్శించుకున్నారు. భారీ అన్నసమారాధనలు, భజనలు నిర్వహించారు.