పలమనేరు: వీ.కోట: కుంటల్లో చెరువుల వద్దకు మీ పిల్లలను పంపకండి అంటూ ప్రజలకు ముఖ్య సూచనలు చేసిన సీఐ సోమశేఖర్ రెడ్డి
వీ.కోట: మండల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు వచ్చాయి, ఈ నేపథ్యంలో పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి చెరువులు కుంటలు దగ్గరకి వెళ్తుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు విరివిగా కురిసి చెరువులు కుంటలు పెద్ద పెద్ద గుంతల్లో నీళ్లు నిండి ఉన్నాయి అందులో గనుక పడితే మునిగి చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా హంద్రీనీవా కాలువ ప్రవహిస్తోంది అందులో ఎట్టి పరిస్థితులను దిగ కూడదని సూచనలు చేశారు.