ఖైరతాబాద్: బీసీలకు 42 రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇంద్ర పార్క్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.