అన్నమయ్య జిల్లాలో బుధవారం పాఠశాలలకు సెలవు: జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం
వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు జారీ చేయడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కాటాబత్తిన సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ నిర్ణయాన్ని గమనించాలన్నారు.