ఒంగోలు అర్బన్: శాప్ లీగ్స్ బాక్సింగ్ టోర్నమెంట్ విజయవంతం. రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “శాప్ లీగ్స్ బాక్సింగ్ టోర్నమెంట్” డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియం నందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జిల్లా క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజరాజేశ్వరి, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, ఫుట్‌బాల్ కోచ్ పాల్ కుమార్, సపక్ తగడ శిక్షకుడు శ్రీనివాసులు, బాక్సింగ్ శిక్షకులు పాణ్యం వేణు, కృష్ణవేణి హాజరయ్యారు