నంద్యాల అర్బన్: నంద్యాల మార్కెట్ యార్డ్ లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్, రాష్ట్ర మార్క్ ఫైడ్ డైరెక్టర్ తులసి
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
నంద్యాల మార్కెట్ యార్డ్ లో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరు రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జొన్నలు కింటాలుకు 3699 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు రైతులకు న్యాయమైన ధర అందించేందుకే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు రైతులు తమ పంటలను దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోని అమ్ముకోవాలని సూచించారు. మధ్యవర్తుల దోపిడీ నుంచి రైతులకు రక్షణ లభిస్తుందని తెలిపారు