నందికోట్కూరు: కొణిదెలకుప్రత్యేక స్కూల్ బస్సునడపాలని రోడ్డెక్కిన విద్యార్థులుచెట్లు మొద్దులు వేసిబస్సులు నిలిపి నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోనికొణిదెల గ్రామంలో బుధవారం విద్యార్థులు రోడ్డెక్కారు,రోడ్డుపై చెట్ల మొద్దులు వేసి ఆర్టీసీ బస్సుల ను నిలిపివేసి నిరసన తెలిపారు,నందికొట్కూరు నుండి నెహ్రు నగర్ కు వెళ్లిన విద్యార్థి బస్సులు కిక్కిరిసి నిలబడడానికి కూడా లేక కొణిదెల విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదని మా గ్రామానికి ప్రత్యేక స్టూడెంట్ బస్సు నడపాలని విద్యార్థులు కోరారు,నందికొట్కూరు ఆర్టీసీ డీఎం వెంటనే స్పందించి కొణిదెల గ్రామానికి విద్యార్థి స్పెషల్ బస్ ప్రత్యేకంగా నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు,స్కూలుకి సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోయారు