ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించే సాదిక్ (52) గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలారు.
ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించే సాదిక్ (52) గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కండక్టర్ సాదిక్ మృతిపై నేషనల్ మజ్దాూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ సంతాపం వ్యక్తం చేశారు. సాదిక్ విధుల పట్ల అంకితభావంతో పనిచేసేవారని ఆయన కొనియాడారు.