కనిగిరి: పట్టణంలో క్లీన్ ఎయిర్ పై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
కనిగిరి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం క్లీన్ ఎయిర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ... వాయు కాలుష్యాన్ని తగ్గించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించి, స్వచ్ఛమైన గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్, మున్సిపల్, మెప్మా, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.