ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జోయాలుక్కాస్ లో 300 ఉద్యోగ అవకాశాలు
Ongole Urban, Prakasam | Jul 4, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ తెలిపారు.ఈ నియామక కార్యక్రమం 2026 జూలై 10వ తేదీ న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జోయాలుక్కాస్ జ్యువెలరీ షోరూమ్, #37-1-169/58, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, కర్నూలు రోడ్, ఒంగోలు లో నిర్వహించబడుతుంది.ఈ నియామకాలలో పురుషులకు 250 పోస్టులు, మహిళలకు 50 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు ఇద్దరూ అర్హులేనన్నారు