నందికోట్కూరు: వేంపేట సమీపంలో, ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ ఒకరి మృతి
నంద్యాల జిల్లాపాములపాడు మండలం వేంపెంట సమీపంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు,మృతుడు వెలుగోడు పట్టణానికి చెందిన సయ్యద్ మీర్ (46)గా గుర్తించారు,ప్రమాదంలో మరో బైకర్ పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు,ఘటనా స్థలానికి చేరుకున్న పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారించారు