కర్నూలు: రైతులు పండించిన ఉల్లి, టమోటా, పత్తి పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి : జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు
రైతులు పండించిన ఉల్లి, టమోటా, పత్తి పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి దంభోళం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం రైతు సంఘం ప్రతినిధి బృందం కల్లూరు మండలంలోని పెద్దటేకూరు, మార్కాపురం కొట్టాల గ్రామాల్లో పంటలను పరిశీలించింది.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు ఉల్లి, టమోటా, పత్తి, పచ్చిమిర్చి, కంది, మొక్కజొన్న వంటి పంటలను విస్తారంగా సాగు చేశారని, కానీ పండిన పంటలకు సరైన ధర దక్కక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉల్లి ధర క్వింటాకు రూ.1200, టమోటా కిలోకు రూ.8 రైతుల