గుంతకల్లు: పట్టణంలో జమాతే కుద్దాముల్ ముస్లిమిన్ కమిటీ ఆధ్వర్యంలో అనాథ వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని జమాతే కుద్దాముల్ ముస్లిమిన్ కమిటీ ఆధ్వర్యంలో అనాథ అయిన వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని హజరత్ మస్తాన్ వలి దర్గా ఆవరణలో శనివారం గుర్తు తెలియని వృద్దుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. వృద్ధుడు అలాగే పడి ఉండటంతో కొందరు స్థానికులు అనుమానంతో అక్కడికి వెళ్ళి పరిశీలించగా మృతి చెందినట్టు గుర్తించారు. స్థానికుల సమాచారంతో కమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.