పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుమిదిని అన్నారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుమిదిని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సిపి లతో బుధవారం సుమారు 4 గం సమయంలో వీసి ద్వారా సమీక్షించారు. నారాయణపేట కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శీను పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2 వ సాధారణ ఎన్నికలను 3 విడతలలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.