ధరణికోట, ఉంగుటూరు, ఏనికపాడు: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్.
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బిందు మాధవ్ సోమవారం తనిఖీ చేశారు. ధరణికోట, ఉంగుటూరు, ఎనికపాడు తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చూడాలని ఆదేశించారు.