అదిలాబాద్ అర్బన్: వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏకకాలంలో దాడులు
రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా జలుపిస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 13 మండలాలలో 43 పోలీస్ బృందాలచే ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలో దాదాపు 18 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్ లు, బాండ్లు, చెక్కు బుక్కులు స్వాదీనం చేసుకున్నారు