పటాన్చెరు: ముత్తంగి జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు
పటాన్చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హరిదోశ హోటల్ సమీపంలో ముందు వస్తున్న కారును తప్పించబోయి బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సింది.