ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలతో పాటు మార్కాపురం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా లక్ష కోట్లతో తీర్చిదిద్దబోతున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మార్కాపురం జిల్లాని అభివృద్ధి చేసేందుకు వెలిగొండ ప్రాజెక్టుని సీఎం పూర్తి చేయబోతున్నారని అంతే కాకుండా కంభం చెరువును పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దబోతున్నారన్నారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేశారని తెలిపారు.