బనగానపల్లె: ఈనెల 12న బనగానపల్లె మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష :ప్రిన్సిపల్ రామలక్ష్మి
నంద్యాల జిల్లా బనగానపల్లె ఏపీ మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న (ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపల్ సీహెచ్ రామలక్ష్మి గురువారం తెలిపారు. హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 గంటల లోపు పరీక్ష హాలుకు చేరుకోవాలని సూచించారు.