రాజేంద్రనగర్: శంకర్ పల్లి లో ముగిసిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చివరి రోజు మంగళవారంతో శంకర్పల్లి మం. పరిధిలో నామినేషన్ల పర్వం ముగిసిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. 8 క్లస్టర్లలో 24 సర్పంచ్ స్థానాలకు 119, 210 వార్డు స్థానాలకు 542 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 6న ఉపసంహరణ, 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.