మస్కట్ లో వేధింపులకు గురవుతున్న మైనార్టీ మహిళను సురక్షితంగా స్వస్థలానికి రప్పించిన చినగంజాం ఎస్సై రమేష్
ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి అక్కడ వేధింపులకు గురవుతున్న ఒక మైనారిటీ మహిళను చిన్నగంజాం పోలీసులు సురక్షితంగా స్వస్థలానికి రప్పించారు.షేక్ సబిహ అనే మహిళ మస్కట్ లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వైనాన్ని ఆమె భర్త ఉస్మాన్ వలి జిల్లా ఎస్పీకి తెలియజేయగా ఆయన ఆదేశాలను అనుసరించి చిన్నగంజాం ఎస్సై రమేష్ తదుపరి చర్యలు గైకొన్నారు.ఆమెను మస్కట్ పంపించిన నెల్లూరు ఏజెంట్ ద్వారా సబిహాను చినగంజాం రప్పించారు.ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఎస్సై సూచించారు.సబిహ దంపతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.