అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఎట్టకేలకు గోదావరి వరదనీటి నుంచి బయటపడింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. గత నెల రోజులుగా గోదావరి వరదల కారణంగా అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం వరద నీటిమట్టం తగ్గడంతో అమ్మవారి ఆలయం బయటపడిందని, అయితే అమ్మవారి ఆలయం చుట్టూ ఇంకా నీటిమట్టం ఉందని ఈ ప్రాంతమంతా బురద మయంగా ఉన్నట్లు తెలిపారు. భక్తులు అప్పుడే దర్శనానికి రావద్దని తెలిపారు.