ఘన్‌పూర్: అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భూమి పూజ చేశారుఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో గిరిజన మహిళలు సాంప్రదాయా నృత్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సల్కలాపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని గౌరారం, మంగనూరు రోడ్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధి చాటున అంతా అవినీతిమయం నడిపించారని ఎమ్మెల్యే విమర్శించారు