అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ ఎర్రి తాత స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మండలంలోని అంగన్వాడి వర్కర్లకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ పిడి అరుణకుమారి, సిడిపిఓ శ్రీదేవిలతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధానంగా బాల్య వివాహాలను అరికట్టడం, పౌష్టికాహార ఆవశ్యకత అంశాలపై వివరించారు. టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున సైతం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.