బనగానపల్లె: యాడికి లో నంద్యాల జిల్లా కు చెందిన వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా యాడికిలోని వెంగమ నాయుడు కాలనీలో దర్గా కట్టపై కూర్చున్న వ్యక్తి ఉన్న ఫలంగా కిందపడి గురువారం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లికి చెందిన సుధాకర్ (34)గా గుర్తించారు. సుధాకర్ యాడికి మం. వేములపాడులో వివాహం చేసుకున్నాడు. వేములపాడుకు వెళ్తున్న క్రమంలో అతిగా మద్యం తాగాడు. దర్గా కట్ట వద్ద కూర్చొని మృతి చెందాడు