షాద్నగర్ పట్టణంలోని చౌరస్తాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. AISF రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.