దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో రాయచోటిలో అప్రమత్తమైన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని టానా జంక్షన్ రద్దీ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అధికారుల ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ సీఐ చలపతి పర్యవేక్షణలో పోలీసులు వాహనదారుల పత్రాలు, హెల్మెట్ వినియోగం, నెంబర్ప్లేట్ వివరాలు తదితరాలను పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో భద్రతా చర్యల భాగంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస