నిజామాబాద్ సౌత్: నగరంలో CPM ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నగరంలోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవాలు వక్రీకరణ అనే అంశంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సిపిఐఎం కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ నగర వీధులు వెంట వెళ్ళి తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సెమినార్కు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ మాట్లాడుతూ..'నాడు దొరల పాలనలో ఇంట్లో తినాలే, దొరకాడ పని చేయాలే అప్పుల చిట్టా అంటూ దొంగ లెక్కలు చూపుతూ తాతలు మనుమల్ల వరకు వెట్టిచాకిరి చేయించుకున్నారన్నారు.