నారాయణపేట్: అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బజరంగ్ దళ్ నాయకులు
నారాయణపేట మండల పరిధిలోని జాజపురం గ్రామ సమీపాన ద్వారకా స్కూల్ ముందర వ్యవసాయ పొలంలో ఆటోలో గోవు లను మంగళవారం సుమారు ఉదయం 6 గం సమయంలో తరలిస్తున్న వ్యక్తులను జాజాపూర్ గ్రామానికి చెందిన బజరంగ్ దళ్ నాయకులు అడ్డగించి ఆటోలో గోవులను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించగా డ్రైవర్ పొంతన లేని సమాధానం తెలపడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ ను వివరాలు అడగగా డ్రైవర్ సరైన సమాధానం తెలుపకపోవడంతో నారాయణపేట పోలీస్ స్టేషన్ తరలించారు. డ్రైవర్ పై మిగతా వారిపై కేసు నమోదు చేసినట్లు బజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. అనంతరం గోవులను గో శాలకు తరలించినట్లు తెలిపారు.