పటాన్చెరు: పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవటం లేదు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు : ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తన పెద్ద కుమారుడు దివంగత గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మరణం అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు నియోజకవర్గం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.