నంద్యాల అర్బన్: ఎన్టీఆర్ అక్షరాలతో 20 చిత్రాలు నంద్యాల చిత్రకారుడి అద్భుత ప్రదర్శన
Nandyal Urban, Nandyal | May 28, 2026
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా NTR అనే అక్షరాలలో 20 NTR చిత్రాలను వేశారు. కేవలం 8 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద NTR పేరును రాసి ఆ మూడు అక్షరాలలో ఎన్టీఆర్ వివిధ పాత్రల రూపాలతో ఉన్న ఫొటోలను అద్భుతంగా వేశారు. ఈ చిత్రాలను మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్ పెయింటింగ్స్ ద్వారా వేశారు