స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ కార్యాక్రమంను హుకుంపేట పిహెచ్సిలో ప్రారంభించిన DMHO డా. టి. విశ్వేశ్వర నాయుడు
స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ కార్యాక్రమంను హుకుంపేట పిహెచ్సిలో అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. టి. విశ్వేశ్వరరావు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది తమ పరిధి కేంద్రాలలో సిద్దం చేసిన ముందస్తు ప్రణాళికల ఆదారంగా ఈ వైద్య శిభిరాల ద్వార మహిళలకు సమయానుకూల వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు, పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు