కనిగిరి పట్టణంలో మౌలిక వసతులు కల్పించి, అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని 5 వ వార్డులో రూ .29.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ గురువారం పరిశీలించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. పట్టణంలో డ్రైనేజీ కాలువలు లేని చోట్ల డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు.