భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దించాలి. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సలీం డిమాండ్.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి .కొత్తకోట పట్టణంలో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దించాలని ఏఐటిసి జిల్లా కార్యదర్శి సలీం బుధవారం డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఈనెల 26న జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు