ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో: ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేశెట్టి హరీష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారి శాలలో విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు, మహిళలు 108 కలశాలను శివాలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం గావించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు