నారాయణపేట పట్టణంలో జీ షాన్ హోటల్ సమీపంలో పళ్ళ వీధికి వెళ్లే మార్గాన బుధవారం రాత్రి గుర్తుతెలియని మృతుడి మృతదేహం లభ్యం అయింది. సుమారు 70 సం. వయస్సు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు పసుపు పచ్చని షర్టు గరం కోటు ధరించినట్లు సూచించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు.