బనగానపల్లె: నందవరం చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ప్రముఖ పుణ్య క్షేత్రమైన నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం పూజలు చేశారు. సీఎం చంద్రబాబు బనగానపల్లె వస్తున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చారు. ఎంపీ శబరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.